డ్యుయోలింగో ఇంగ్లిష్ టెస్ట్‌లో మోసం
అడ్డంగా దొరికిన ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్ – విదేశాలలోని యూనివర్శిటీలలో చదువు కోవాలంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ టెస్టు పాస్ కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి వివిధ రకాల పేర్లతో పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీ మోసం బయట పడింది.
డ్యుయోలింగో ఇంగ్లీష్ టెస్టును నిర్వహించారు. ఇందులో మరొకరికి అడ్మిషన్లు రావాలనే ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం వారి తరపున ఏడుగురు పరీక్షలు రాశారు. వీరిని పరీక్ష రాస్తుండగా పట్టుకున్నారు.
విచిత్రం ఏమిటంటే విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందాలని అనుకునే వారికి మద్దతుగా వీరు ఎగ్జామ్స్ రాస్తూ పట్టుబడ్డారు. మొత్తం ఏడుగురు పట్టుబడ్డారు. వీరు ఆయా అభ్యర్థుల తరపున ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 5,000 నుంచి రూ. 10,000 కు పైగానే వసూలు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఎల్‌బి నగర్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ద్వారా అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా మొదలైన అంతర్జాతీయ విశ్వవి ద్యాలయాలలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ఇంగ్లీష్ అర్హత పరీక్ష అయిన డ్యూయోలింగో పరీక్షకు హాజరైనందుకు వెంకటేశ్వర లాడ్జి వద్ద ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు.
వీరి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 పాస్‌పోర్టులు, 7 సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.