రికార్డ్ బ్రేక్ చేసిన ప్రముఖ ఆలయం
కేరళ – కేరళ లోని ప్రసిద్ద ఆలయం శబరిమల రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 440 కోట్ల ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆలయ పరిపాలన నిర్వహణను కఠినంగా ఉంచింది. ఈసారి, దర్శనం ప్రారంభం నుండి, ఆలయ పరిపాలన దర్శన సమయ పరిమితిని ఒక గంట నుండి 18 గంటలకు పెంచింది. ఈసారి శబరిమల దర్శనం కోసం 6,00,000 మందికి పైగా భక్తులు వచ్చారు.
ఇదిలా ఉండగా వర్చువల్ లైన్ , స్పాట్ బుకింగ్ కోసం ప్రభుత్వం రోజుకు 80,000 మంది భక్తుల పరిమితిని నిర్ణయించింది. గత ఏడాది కంటే ఈసారి శబరిమల ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. ఆశించిన దానికంటే ఎక్కువగా వచ్చారు.
రద్దీ ఎక్కువ అయినప్పటికీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. రాష్ట్ర సర్కార్ దగ్గరుండి పర్యవేక్షించింది. ఎక్కడా చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల ఏర్పాట్లు చేశారు. మొత్తంగా గణనీయమైన ఆదాయం సమకూరడంతో శబరిమల ఆలయ కమిటీ సంతోషం వ్యక్తం చేసింది.