సీఎం రేవంత్ రెడ్డికి షబ్బీర్ లేఖ
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఘాటు లేఖ రాశారు. 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే పేరుతో రూ. 100 కోట్ల ప్రజా ధనం వృధా చేసిందంటూ ఆరోపించారు. ఆనాడు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని సీఎంను కోరారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. మరో వైపు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ను వెల్లడించింది. శాసన సభలో విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీని కోసం రూ. 160 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. దీనిపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు.
మరో వైపు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు ఇప్పటి వరకు పని చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటూ ఆరోపించారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతుండడం గమనార్హం.