నెట్టింట్లో బాద్ షా వైరల్
బట్లర్ కు ఖాన్ అభినందన
కోల్ కతా – బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మనసులో ఏదీ పెట్టుకోడు. తను ప్రస్తుతం క్రికెట్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాడు. తన తోటి నటి జూహ్లీ చావ్లాతో కలిసి కోల్ కతా నైట్ రైడర్స్ యజమానిగా ఉన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2024 రంజుగా జరుగుతోంది. తాజాగా తను ట్రెండింగ్ లో నిలిచాడు. ఇందుకు ప్రధాన కారణం కోల్ కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ . అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది చివరి బంతి వరకు. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒంటి చేత్తో మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్.
ఓ వైపు టపా టపా వికెట్లు కూలుతున్నా ఎక్కడా తల వంచ లేదు. అడ్డు గోడలా నిలిచాడు. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టుకు యజమాని అయిన షారుక్ ఖాన్ తన ఆట తీరుతో ఆకట్టు కోవడంతో బట్లర్ ను ప్రత్యేకంగా మైదానంలోకి వచ్చి అభినందించాడు. అంతే కాదు అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.