ఐపీఎల్ కప్ తో కింగ్ ఖాన్
ముద్దాడిన బాలీవుడ్ బాద్ షా
చెన్నై – ఐపీఎల్ 2024 ఫైనల్ కథ ముగిసింది. విజేతగా శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించిన సన్ రైజర్స్ ను అద్భుతమైన ఆట తీరుతో, సమిష్టి ప్రదర్శనతో దుమ్ము రేపింది. చుక్కలు చూపిస్తూ 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.
తొలుత చెన్నై లోని చెపాక్ స్టేడియంలో బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేసింది. కోల్ కతా బౌలర్ల దెబ్బకు తల వంచింది. 113 పరుగులకే పరిమితమైంది. మిచెల్ స్టార్క్ , ఆండ్రీ రస్సెల్ బౌలింగ్ దెబ్బకు విల విల లాడింది. ఏ కోశాన పోరాట పటిమను ప్రదర్శించ లేక పోయింది.
ఇక ఓటమి అంటే ఛీదరించుకునే మాజీ క్రికెటర్ , బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ మార్గదర్శకత్వంలో కోల్ కతా నైట్ రైడర్స్ రాటు దేలింది. ప్రధానంగా వెంకటేశ్ అయ్యర్, రహమనుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్ , రింకూ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు గెలుపులో కీలక పాత్ర పోషించారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ సత్తా చాటారు.
దీంతో ఐపీఎల్ కప్ విజేతగా నిలిచిన కోల్ కతా జట్టుకు భారీ నజరానా ప్రకటించాడు ఆ జట్టు యజమాని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. ఆయన కప్పును ముద్దాడాడు. అంతే కాదు గంభీర్ కు కిస్ కూడా ఇచ్చాడు