బాద్ షా..జుహీ ఆశలు ఫలించేనా
కోల్ కతా నైట్ రైడర్స్ కప్ గెలిచేనా
చెన్నై – ఐపీఎల్ 2024 బిగ్ లీగ్ చివరి దశకు చేరుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం ఫైనల్ పోరుకు తల పడేందుకు సిద్దమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్.
ఇదిలా ఉండగా ఐపీఎల్ లీగ్ లో తొలి నుంచి ఇప్పటి దాకా ఒకటి రెండు మ్యాచ్ లు తప్పిస్తే అన్ని మ్యాచ్ ల లోనూ సత్తా చాటింది కోల్ కతా నైట్ రైడర్స్. జట్టుకు నూతన కోచ్ గా నియమించింది కేకేఆర్ యాజమాన్యం. ప్రత్యేకించి ఏరికోరి తీసుకుంది మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ను. తను స్వతహాగా క్రికెట్ ప్రేమికుడు. అంతే కాదు ఏ కోశానా ఓటమిని ఒప్పుకోడు.
తను కోరుకున్న విధంగానే కోల్ కతా జట్టును తీర్చి దిద్దాడు. ఇప్పుడు దుర్బేధ్యమైన రీతిలో విస్తు పోయేలా ఆడుతోంది కోల్ కతా నైట్ రైడర్స్. ఇదిలా ఉండగా అంతులేని ఆనందానికి లోనయ్యారు కేకేఆర్ యజమానులు , ప్రముఖ బాలీవుడ్ నటీ నటులు బాద్ షా షారుక్ ఖాన్ , జూహ్లీ చావ్లా.
ఇప్పటికే కోట్లాది మంది వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ ఐపీఎల్ ఫైనల్ పోరును. రిలయన్స్ జియో రికార్డు వ్యూయర్ షిప్ ను దాటనుంది. మొత్తంగా బాద్ షా ..చావ్లా ఆశలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.