ENTERTAINMENT

నా కుటుంబమే నా ప్ర‌పంచం

Share it with your family & friends

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్

ముంబై – బాలీవుడ్ బాద్ షా , ప్ర‌ముఖ న‌టుడు షారుక్ ఖాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ముఖ న‌టి ప్రీతి జింటాతో ముచ్చటించారు. ఈ సంద‌ర్బంగా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. మీరు నిత్యం సంతోషంగా ఉండేందుకు గ‌ల కార‌ణాలు ఏమిటి అని అడిగారు. అంతులేని సంప‌ద ఉన్నా, లెక్క‌లేనంత మంది అభిమానులు ఉన్న‌ప్ప‌టికీ తాను ప‌నిని ఎక్కువ‌గా ప్రేమిస్తానంటూ చెప్పారు షారుక్ ఖాన్.

ఇదే స‌మ‌యంలో తాను మ‌రింత ఆనందంగా ఉండేందుకు ముఖ్య‌మైన‌ది ఏమిటంటే తాను ఎవ‌రి గురించి ప్ర‌త్యేకంగా ఆలోచించన‌ని స్ప‌ష్టం చేశారు బాలీవుడ్ బాద్ షా. ఇత‌రుల ప‌ట్ల ప్రేమ పూర్వ‌కంగా ఉంటాన‌ని చెప్పారు . వారి గురించి చెడుగా ఆలోచించ‌ను. మంచిగా కూడా ఆలోచించేందుకు ఇష్ట ప‌డ‌ను.

ఎవ‌రి జీవితం వారిదే. మ‌న‌కు ఉన్న‌ది ఒక్క‌టే లైఫ్. వంద శాతం మ‌నుషుల గురించి, నా కుటుంబం, నా స్నేహితుల గురించి త‌ప్ప నేను ఇత‌రులు ఎలా ఉన్నార‌నేది ప‌ట్టించుకోను అని పేర్కొన్నారు. నాకు నా ఫ్యామిలీ త‌ర్వాతే ఏదైనా..ఎవ‌రైనా. ఇదే నా ఆనందానికి కార‌ణం అంటూ స్ప‌ష్టం చేశారు షారుక్ ఖాన్.