గిగ్..ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం సమగ్ర చట్టం
ఏర్పాటు చేయాలని షేక్ సలావుద్దీన్ డిమాండ్
హైదరాబాద్ – తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ ఫామ్ కార్మికుల కోసం సమగ్ర చట్టం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యప్ బేస్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ (IFAT) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలాహుద్దీన్. బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
4 లక్షల 20 వేల మందికి పైగా గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల హక్కులు కాపాడడంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్, ప్లాట్ ఫామ్ కార్మికుల పట్ల తీసుకున్న ప్రామాణిక భరోసా పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గిగ్ , ప్లాట్ ఫామ్ కార్మికుల హక్కులను రక్షించే చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఆరోగ్యం, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు.
కర్ణాటకలో ఉన్నట్టుగా పారదర్శకమైన ట్యాక్సీ ఛార్జీల నియంత్రణ , న్యాయమైన వేతనాల కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు షేక్ సలా వుద్దీన్.
ప్రైవేట్ ప్లాట్‌ఫామ్ లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రైడ్-హైలింగ్ యాప్‌ను అభివృద్ధి చేయాలని అన్నారు. ఇదే సమయంలో ప్రజల ఆవశ్యకతలను నేరుగా తెలుసు కునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంప్రదింపులు నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచించారని గుర్తు చేశారు. తగిన సూచనలు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ (హక్కులు, సంక్షేమం) చట్టం, 2024ను త త్వరగా ముసాయిదా చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ సలాహుద్దీన్ డిమాండ్ చేశారు.