ప్రకటించిన టాటా గ్రూప్ చైర్మన్
ముంబై – రతన్ టాటా సన్నిహితుడు శంతను నాయుడుకు కీలక పదవి దక్కింది. టాటా గ్రూప్స్ కు చెందిన టాటా మోటార్స్ లో జనరల్ మేనేజర్ గా నియమితులయ్యారు. టాటాకు చివరి దశలో అసిస్టెంట్ గా పని చేశాడు. కొత్త పదవిలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు శంతను నాయుడు. కంపెనీలో వ్యూహాత్మక కార్యక్రమాలను చూస్తాడు. ఇది తన కెరీర్ లో ఒక ముఖ్యమైన మైలు రాయి అని చెప్పక తప్పదు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు శంతను నాయుడు. తన మూలాలు ఏపీతో ముడిపడి ఉన్నాయి. ఇది పక్కన పెడితే టాటా మోటార్స్‌తో తనకున్న లోతైన సంబంధాన్ని శాంతను నాయుడు గుర్తు చేసుకున్నారు.
ఈ సమయంలో రతన్ టాటా లేక పోవడం తనను మరింత బాధకు గురి చేస్తోందన్నాడు. పనిలోనే తనను చూసుకుంటున్నానని, అయినా నిద్ర పట్టడం లేదన్నారు. ప్రతి రోజూ తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని వాపోయాడు శంతను నాయుడు. చిన్న వయసులోనే జీఎం లాంటి ఉన్నత పదవి దక్కడం తనకు గర్వంగానే ఉన్నా మరింత బాధ్యతను పెంచిందన్నాడు.