ఇక నవ్వడం చూడలేను..నవ్వించ లేను
రతన్ టాటా సన్నిహితుడు శాంతను నాయుడు
ముంబై – మరోసారి తీవ్రమైన భావోద్వేగాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన గుడ్ ఫెలోస్ ఫౌండర్ శాంతను నాయుడు. యావత్ దేశం ఇంకా రతన్ టాటా ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతోంది. ఈ సందర్బంగా తుది వీడ్కోలు పలికే సమయంలో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు శాంతను నాయుడు.
గత 10 ఏళ్లుగా రతన్ టాటాతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు తను. టాటా ట్రస్ట్ కు జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. తొలుత ఇంటర్న్ గా ప్రారంభమైన శాంతను నాయుడు జీవితం చివరకు రతన్ టాటాకు నమ్మకమైన వ్యక్తిగా ఎదిగేంత వరకు చేరాడు.
ఇద్దరి మధ్య సామీప్యత పెరగడానికి ప్రధాన కారణం కుక్కలను ప్రేమించడం, అనాధలను, వృద్దుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం. రతన్ టాటాను కోల్పోవడం తననే కాదు కోట్లాది మందిని దుఖః సాగరంలో ముంచేసిందని ఇది పూడ్చలేనిదని పేర్కొన్నాడు శాంతను నాయుడు.
శనివారం తను ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డ్ ఇన్ లో మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేను ఆయనను మరలా నవ్వడం చూడలేను లేదా ఆయనను ఇక నవ్వించ లేను అంటూ పేర్కొన్నాడు.
.
గత 3 రోజులుగా, దేశం నలుమూలల నుండి తమ సందేశాలు పంపుతూనే ఉన్నారు. నేను కన్నీళ్టు పెట్టుకున్న ప్రతీసారి ఏదో ఒక సందేశం నన్ను మరింత ఆలోచింప చేసేలా చేస్తోందన్నారు శాంతను నాయుడు.