సమిష్టి కృషితోనే సక్సెస్ సాధ్యం – శాంతను
ప్రాజెక్టు బాగుండాలంటే కష్టపడాలి
ముంబై – గుడ్ ఫెలోస్ ఫౌండర్ , టాటా ట్రస్ట్ గ్రూప్ మాజీ ఉద్యోగి శాంతను నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రాజక్టు లేదా ఏ పనిని చేపట్టినా ముందుగా సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని , ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇదే తాను ముందు నుంచీ నేర్చుకున్నానని చెప్పారు శాంతను నాయుడు.
ఏ పని చేపట్టినా లేదా ఏ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలన్నా ముందుగా అది సామాజిక ప్రయోజం కలిగినదై ఉండాలని స్పష్టం చేశారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది అంటూ ఎదురు కాదని పేర్కొన్నారు శాంతను నాయుడు.
ప్రధానంగా ప్రాజెక్టుకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే, పరిష్కరించే నైపుణ్యం, ధైర్యం కలిగి ఉండాలని పేర్కొన్నాడు. ఎందుకు అనే ఉద్దేశానికి సంబంధించిన వాస్తవికతను పరిష్కరించేలా చూడాలని సూచించాడు శాంతను నాయుడు.
పని లేదా ప్రాజెక్టు సక్సెస్ కావాలంటే ఓర్పుతో ఉండాలి, పట్టుదలను వీడకూడదు. సమస్యను గుర్తించి సరైన మార్గంలో పరిష్కరించే తెలివి, ఎక్కడా రాజీ పడని మనస్తత్వాన్ని కలిగి ఉండడం ముఖ్యమని పేర్కొన్నాడు. మిషన్ కు అనుగుణంగా ఉండే టీంను ఎంపిక చేసుకోవాలని సూచించాడు శాంతను నాయుడు.