రాష్ట్ర సమాచార కమిషనర్ కోసం పైరవీ చేసిన సీఎస్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కీలకమైన పదవి అప్పగించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) వైస్ చైర్మన్ గా నియమించింది.రెండు రోజుల్లో పదవీ విరమణ చేసిన వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములలో చెట్లు కొట్టేయడం పట్ల సీఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరాక ఏపీకి చెందిన పలువురు ఉన్నతాధికారులకు పెద్దపీట లభించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
విచిత్రం ఏమిటంటే గత బీఆర్ఎస్ హయాంలో సీఎస్ గా శాంతి కుమారి కొలువు తీరారు. రిటైర్ అయ్యాక కూడా మరో పదవి కోసం పాకులాడారు. ఆమె తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ గా ప్రయత్నం చేశారు. తీరా తను తీసుకున్న నిర్ణయం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం నిప్పులు చెరిగింది. యూనివర్శిటీ భూముల పక్కనే తాత్కాలికంగా జైలు కట్టించి అందులో ఉంచుతామని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత శాంతికుమారి తన ప్రయత్నం విరమించుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్ లో మొత్తం ఏపీకి చెందిన వారే పెత్తనం చెలాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. మొత్తంగా సీఎస్ ఎట్టకేలకు తాను అనుకున్న పోస్ట్ కాక పోయినా ఇంకో పోస్టు చేజిక్కించుకుంది.