అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పోటీ
స్పష్టం చేసిన ఎన్సీపీ చీఫ్ పవార్
మహారాష్ట్ర – ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరాఠాలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై స్పందించారు. ఆదివారం శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాము కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది వచ్చే అక్టోబర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా తమ పార్టీతో పాటు శివసేన యుబిటీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పోటీ చేయనున్నాయని ప్రకటించారు శరద్ పవార్.
దేశంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఘన విజయాన్ని నమోదు చేశాయని తెలిపారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో సంకీర్ణంలో భాగమైన చిన్న మిత్రపక్షాల ప్రయోజనాలను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరిరక్షించడం మహారాష్ట్ర లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నైతిక బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు శరద్ పవార్.