పీకే బీజేపీ మౌత్ పీస్ – పవార్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్సీపీ చీఫ్
మరాఠా – ఎన్సీపీ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన స్వప్రయోజనాల కోసం పదే పదే భారతీయ జనతా పార్టీకి వంత పాడుతున్నాడని ఆరోపించారు.
ఈ మేరకు ఆయన కాషాయ పార్టీకి మౌత్ పీస్ గా మారి పోయాడని మండిపడ్డాడు. ఆయన ఎన్నికల వ్యూహకర్త కానే కాదని బీజేపీ నియమించుకున్న పార్టీ నేత అంటూ పేర్కొన్నారు. పీకే మాటలను ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదన్నారు శరద్ పవార్.
బీజేపీకి 300 సీట్లకు పైగా వస్తాయని పదే పదే చెప్పడాన్ని ప్రస్తావించారు. ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీకి, మోదీకి ఎదురుగాలి వీస్తోందన్నారు. ఈ సమయంలో ఎలా బీజేపీ పవర్ లోకి వస్తుందని ప్రశ్నించారు శరద్ పవార్.
ఇకనైనా ప్రశాంత్ కిషోర్ తన దుకాణం మూసుకుంటే మంచిదని సెలవు ఇచ్చారు. మరాఠా ప్రజలు ముఖ్యంగా ఎన్సీపీ సైనికుల ఆగ్రహానికి గురి కావద్దంటూ హెచ్చరించారు.