శ్రీవారి దర్శనం శ్రీకాళాహస్తిలో ప్రత్యక్షం
భక్తులకు దర్శనం ఇచ్చిన శర్నానంద్ మహరాజ్
తిరుమల – ఎవరీ శర్నానంద్ జీ మహరాజ్ అనుకుంటున్నారా. ఆయన జగమెరిగిన స్వామీజీ. మోడీ సర్కార్ వచ్చాక స్వాములకు ప్రాధాన్యత పెరిగింది. వారు ఏం చెబితే అది. ఇప్పుడు దేశం వారి పర్యవేక్షణలో నడుస్తోంది. పీఎంతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శిష్యులుగా మారి పోయారు. నిత్యం స్వాములను దర్శిస్తూ తరిస్తున్నారు.
తాజాగా ఉత్తర భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన స్వామీజీగా గుర్తింపు పొందారు శర్నానంద్ జీ మహరాజ్. ఆయన గత కొన్ని రోజులుగా ఉన్నట్టుండి మాయమై పోయారు. దీంతో శిష్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే తాను ఎవరికీ చెప్పకుండా తిరుమలలోని కలియుగ దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లారు. విషయం తెలుసుకున్న భక్తులు శర్నానంద్ జీ మహరాజ్ ను గుర్తు పట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కట్టారు. మొత్తంగా కనిపించకుండా పోయిన తమ స్వామీజీ ఉన్నారని తెలుసుకుని భక్తులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఆరా తీశారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.