ఆకట్టుకున్న శశాంక్ సింగ్
ముంబైకి షాకిచ్చిన క్రికెటర్
పంజాబ్ – ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చివరి దాకా పోరాడి ఓడి పోయింది. ఆఖరు ఓవర్ లో మ్యాజిక్ జరగడం, రనౌట్ కావడంతో కథ ముగిసింది. ఆఖరులో నువ్వా నేనా అన్న రీతిన చేరుకుంది మ్యాచ్.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 193 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. సూర్య కుమార్ యాదవ్ 78 రన్స్ చేస్తే రోహిత్ శర్మ 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆఖరులో తిలక్ వర్మ 34 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. మిగతా ఆటగాళ్లు ఎవరూ ఆశించిన మేర ఆడలేక పోయారు. ఆఖరున వచ్చిన టిమ్ డేవిడ్ మెరిపించాడు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. త్వర త్వరగా 4 వికెట్లను కోల్పోయింది. ఈ సమయంలో 90 లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ సీన్ మార్చేశారు ఇద్దరు కుర్రాళ్లు. శశాంక్ సింగ్ 41 రన్స్ తో రెచ్చి పోయాడు. 25 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్సర్లతో 41 రన్స్ చేశాడు.
మరో యంగ్ స్టార్ అశు తోష్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 61 రన్స్ చేశాడు. మొత్తంగా శశాంక్ అందరినీ ఆకట్టుకున్నాడు.