నెహ్రూ వారసత్వం గొప్పది
కితాబు ఇచ్చిన శశి థరూర్
హర్యానా – తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానాలో పర్యటించారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి తరపున ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.
ఈ దేశ అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారని, జాతి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చిన నెహ్రూ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు శశి థరూర్.
ఈ సందర్బంగా నెహ్రూ గురించి ప్రశంసలు కురిపించారు. ఆయన వారసత్వాన్ని మనం మరిచి పోకూడదన్నారు. 17 ఏళ్లుగా దేశ తొలి ప్రధానమంత్రిగా నిర్దేశించిన ప్రజాస్వామ్య సంస్థలు, విలువల కారణంగానే టీ అమ్మే వాడు నరేంద్ర మోడీ పీఎం కాగలిగాడని అన్నారు.