సంజూ శాంసన్ కేరళకు గర్వ కారణం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కితాబు
కేరళ – కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ప్రముఖ రచయిత , తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. ప్రత్యేకించి తమ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అంటే ఇష్టం కూడా.
గత కొంత కాలం నుంచీ కేంద్ర సర్కార్ పై, ప్రధానంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై, కార్యదర్శి జే షాపై, ఆయన తండ్రి హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏకి పారేస్తూ వస్తున్నారు. కావాలని ప్రతిభ కలిగిన క్రికెటర్లను ఎంపిక చేయకుండా వివక్ష పాటిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు.
ఈ సమయంలో తాజాగా క్రికెటర్ సంజూ శాంసన్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన 3వ టి20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతే కాదు భారత దేశ క్రికెట్ రంగంలో రోహిత్ శర్మ తర్వాత సంజూ శాంసన్ రెండో స్థానంలో ఉన్నాడు.
మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 8 సిక్సర్లు 11 ఫోర్లతో 111 రన్స్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటూ బంగ్లా బౌలర్లను ఊచకోత కోశాడు. ఇదిలా ఉండగా ఎంపీని కలుసుకున్నారు సంజూ శాంసన్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు శశి థరూర్. శాంసన్ కేరళకు గర్వ కారణమని పేర్కొన్నారు. ప్రశంసలు కురిపించాడు ఎంపీ.