ధృవ్ రాఠీకి శశి థరూర్ ప్రశంస
అద్బుతమైన యూట్యూబర్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ అభ్యర్థి శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో మోదీ ఎలా తనంతకు తానుగా ప్రచారం చేసుకుంటున్నాడో, ఎలా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడనే దానిపై విస్తృతంగా తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు యువ జర్నలిస్ట్ , అనలిస్ట్ , ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ. ఆయన ఒక్కో వీడియో మిలియన్ల కొద్దీ చూస్తున్నారు. భారీ ఎత్తున ఆదరణ చూరగొంటోంది.
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చెందిన సంస్థల వీడియోలను తలదన్నే రీతిలో ఉంటున్నాయి. సమకాలీన అంశాలపైనే కాకుండా ధృవ్ రాఠీ ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ సర్కార్ చేస్తున్న దాష్టీకాలను, దౌర్జన్యాలను , కులం, మతం పేరుతో సృష్టిస్తున్న విధ్వంసాన్ని, ఎలక్టోరల్ బాండ్ల పేరుతో సాగించిన దందాను బట్ట బయలు చేస్తున్నాడు .
ఇప్పుడు అతడి వీడియోలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది సోషల్ మీడియాలో. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ధృవ్ రాఠీని ఎదుర్కొనేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ సందర్బంగా ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ధృవ్ రాఠీతో ప్రత్యేకంగా సంభాషించారు. ప్రతి ఒక్క భారతీయుడు చూసి తీరాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.