ప్రచారం కోసం మోడీ ధ్యానం
ప్రముఖ నటుడు సిన్హా సెటైర్
బీహార్ – ప్రముఖ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సెటైర్ వేశారు. కేవలం ప్రచారం కోసమే తను ధ్యానం పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు సిన్హా.
తను ఒక్కడే దేశ భక్తుడినంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ దేశంలో ఎవరు దేశ భక్తులో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఆయన ఎన్ని సార్లు ధ్యానం చేసినా లేదా దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించినా ఈసారి ఫలితాలు మాత్రం మోడీకి వ్యతిరేకంగా రాబోతున్నాయని జోష్యం చెప్పారు టీఎంసీ ఎంపీ.
మోడీ తనకు అత్యంత మిత్రుడని ,ఆయన మనస్తత్వం గురించి తనకు బాగా తెలుసన్నారు. తను ప్రధానమంత్రిగా ఉన్నా ఎల్లప్పుడూ ధన ధ్యాస, దృష్టి మాత్రం వ్యక్తిగత ప్రచారం పైనే ఉంటుందని అన్నారు. ప్రధానికి దేశం పట్ల ప్రేమ లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.