రాజ్ దీప్ పై షాజియా ఇల్మీ ఫైర్
తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆగ్రహం
న్యూఢిల్లీ – ప్రముఖ మీడియా జర్నలిస్ట్ , ఇండియా టుడే గ్రూప్ కు చెందిన రాజ్ దీప్ సర్దేశాయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ. తన పట్ల సదరు ఛానెల్ కెమెరామెన్ అనుచితంగా ప్రవర్తించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో కెమెరామెన్ ను వెనకేసుకు వచ్చిన రాజ్ దీప్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షాజియా. ఇదేనా మీ మీడియా అనుసరించాల్సిన పద్దతి అంటూ నిప్పులు చెరిగారు. తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. శనివారం ట్విట్టర్ వేదికగా షాజియా ఇల్మీ స్పందించారు.
రాజ్ దీప్ ఛానెల్ లో డిబేట్ నిర్వహించాడు. షాజియాను కూడా పిలిచాడు. ఈ సమయంలో తన శరీరంపై ఎక్కువగా కెమెరామెన్ ఫోకస్ పెట్టాడని, దానిని తాను గ్రహించానని అందుకే మైక్ కట్ చేసి వెళ్లి పోవాల్సి వచ్చిందని పేర్కొంది షాజియా ఇల్మీ.
తన అనుమతి లేకుండా తనను చిత్రీకరించారంటూ వాపోయింది . ఇంటి నుండి వెళ్లి పోమని ఆదేశించానని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు . జర్నలిస్ట్ ముసుగు వేసుకున్న ఓ ప్రచారకర్త అంటూ రాజ్ దీప్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా రాజ్ దీప్ స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు. ఎలా బిహేవ్ చేసిందో వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.