NEWSNATIONAL

రాజ్ దీప్ పై షాజియా ప‌రువు న‌ష్టం దావా

Share it with your family & friends

అనుమ‌తి లేకుండా వీడియో అప్ లోడ్

ఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు షాజియా ఇల్మీ బిగ్ షాక్ ఇచ్చారు. ఇండియా టుడే గ్రూప్ ఛాన‌ల్ కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ పై ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతే కాకుండా ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చారు రాజ్ దీప్ దేశాయ్. ఇందుకు సంబంధించి షాజియా ఎలా ప్ర‌వ‌ర్తించార‌నే దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు షాజియా ఇల్మీ. శుక్ర‌వారం ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది ఆమె. రాజ్ దీప్ స‌ర్దేశాయ్ పై ప‌రువు న‌ష్టం కింద దావా వేశారు.

రాజ్‌దీప్ సర్దేశాయ్ తన అనుమతి లేకుండా తీసిన ఒక వీడియోను తన ఇమేజ్‌ను కించ పరిచేలా అప్‌లోడ్ చేశారని షాజియా ఆరోపించింది పిటిష‌న్ లో.

ఇదిలా ఉండ‌గా రాజ్‌దీప్ సర్దేశాయ్ , ఇండియా టుడే సందేహాస్పద వీడియోను రికార్డ్‌లో ఫైల్ చేయమని హైకోర్టు ఆదేశించింది.

షాజియా రాజ్‌దీప్‌ను జర్నలిస్టుగా మారు వేషంలో ఉన్న రాజకీయ ప్రచారకుడిని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.