Monday, April 21, 2025
HomeNEWSగొర్రెల కొనుగోలు పేరుతో దోపిడీ

గొర్రెల కొనుగోలు పేరుతో దోపిడీ

7 జిల్లాల్లో రూ. 253 కోట్ల స్కాం

హైద‌రాబాద్ – కంట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్ ) తీవ్ర స్థాయిలో త‌ప్పు ప‌ట్టింది గ‌తంలో కొలువు తీరిన బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యంలో చోటు చేసుకున్న గొర్రెల పంపిణీ ప‌థ‌కం గురించి. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని పేర్కొంది. దీనిపై విచార‌ణ జ‌రిపిన కాగ్ ఏకంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ ఎత్తున గొర్రెల ప‌థ‌కం పేరుతో మోసానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించింది. ఇప్ప‌టికే ప‌శు సంవ‌ర్ద‌క శాఖ‌కు సంబంధించి న‌లుగురు ఉన్న‌తాధికారుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 253 కోట్ల మేర డ‌బ్బ‌లుఉ చేతులు మారాయని కాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. సేమ్ సీన్ బీహార్ లో గతంలో చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి అప్ప‌టి బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను దోషిగా తేల్చింది. ఆయ‌న‌కు జైలు శిక్ష ప‌డింది. అనారోగ్యం కార‌ణంగా బెయిల్ పై బ‌య‌ట ఉన్నారు.

ఒకే ట్రిప్పుల్లో వందలాది గొర్రెలను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అంబులెన్స్‌లలో రవాణా చేసినట్లు పేర్కొన‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది కాగ్. ఇదే స‌మ‌యంలో బీహార్ ప‌శుగ్రాసం స్కామ్ లో గేదెల‌ను ద్విచ‌క్ర వాహ‌నాలు, అంబులెన్స్ లు, కార్లు, ఆటో రిక్షాల్లో ర‌వాణా చేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆనాటి సీఎం కేసీఆర్ జైలుకు వెళ‌తారా లేక అప్ప‌టి మంత్రిగా ఉన్న త‌ల‌సాని శిక్ష అనుభ‌విస్తారా అనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments