NEWSNATIONAL

నా తొల‌గింపు వెనుక అమెరికా కుట్ర

Share it with your family & friends

షేక్ హ‌సీనా సంచ‌ల‌న కామెంట్స్

న్యూఢిల్లీ – బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె అమెరికా దేశంపై , ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ పై నిప్పులు చెరిగారు. అమెరికా చేసిన కుట్ర‌ల కార‌ణంగానే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని వాపోయారు.

ఆమె రాజీనామా చేసిన అనంత‌రం ప్ర‌స్తుతం ఇండియాలో ఉంటోంది. ఆదివారం సామాజిక మాధ్య‌మం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

సెయింట్ మార్టిన్ ద్వీపం కోసం అమెరికా తనను అధికారం నుండి తొలగించిందని ఆరోపించారు షేక్ హ‌సీనా. కానీ అందుకు తాను ఒప్పుకోలేద‌ని, దీంతో క‌క్ష క‌ట్టి అల్ల‌ర్ల‌ను ఎగ‌దోసింద‌ని, తాను రాజీనామా చేసేలా ప‌రిస్థితుల‌ను క‌ల్పించింద‌ని వాపోయింది.

బంగాళా ఖాతంపై నియంత్రణ సాధించడమే అమెరికా లక్ష్యం. మరింత హింసను నివారించేందుకు నేను రాజీనామా చేశానని అన్నారు షేక్ హ‌సీనా. ఇలాంటి కుట్ర‌ల‌కు, మోసాల‌కు బంగ్లాదేశ్ యువ‌తీ యువ‌కులు బ‌లి కావ‌ద్ద‌ని కోరారు.