ఘజియాబాద్ లో షాపింగ్ చేసిన హసీనా
రూ. 30 వేలకు సరిపడా దుస్తుల కొనుగోలు
ఢిల్లీ – బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత దేశంలో తల దాచుకుంది. అక్కడ చోటు చేసుకున్న తిరుగుబాటు కారణంగా ఆమె సురక్షితమైన ప్రదేశంగా యునైటెడ్ కింగ్ డమ్ ను ఎంచుకుంది. కానీ యుఎస్ఏ ఒత్తిళ్ల మేరకు లండన్ నుంచి ఇంకా షేక్ హసీనాకు పర్మిషన్ రాలేదు.
దీంతో తను భారత దేశానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీకి చేరుకుంది. ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తోంది మోడీ సర్కార్. గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ ఇండియాకు మిత్ర దేశంగా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఛాందసవాదులు పేట్రేగి పోతున్నారు. అందినంత మేర లూటీ చేస్తున్నారు. ప్రత్యేకించి హిందువులను టార్గెట్ చేయడం, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ తరుణంలో షేక్ హసీనా ఘజియాబాద్ లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో షాపింగ్ చేసింది. రూ. 30000 విలువైన కొన్ని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసింది. షాపింగ్ చేస్తున్న సమయంలో ఆమె వద్ద ఉన్న పూర్తి డబ్బులు అయి పోయినట్లు సమాచారం.
చాలా సామాన్లు తన వెంట తెచ్చుకోలేక పోయింది. ప్రస్తుతం షేక్ హసీనా షాపింగ్ చేస్తున్న విషయం సంచలనంగా మారింది.