Sunday, April 20, 2025
HomeNEWSINTERNATIONALమ‌రో పాకిస్తాన్ కానున్న బంగ్లాదేశ్

మ‌రో పాకిస్తాన్ కానున్న బంగ్లాదేశ్

హెచ్చ‌రించిన షేక్ హ‌సీనా కొడుకు

బంగ్లాదేశ్ – మాజీ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా కుమారుడు స‌జీబ్ జాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం దేశం క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంద‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా అదుపు త‌ప్పింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు స‌జీబ్ జాయ్.

ఒక‌వేళ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో శాంతి భద్రతలను గ‌నుక పునరుద్ధరించకుంటే పాకిస్థాన్‌కు ఎదురైన గతి బంగ్లాదేశ్‌కు ఎదురవుతుందని షేక్ హసీనా కుమారుడు హెచ్చ‌రించారు.

“హిందువులు , అవామీ నాయకులపై దాడులు జరుగుతున్నాయ‌ని, ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించడానికి మా అమ్మ షేక్ హ‌సీనా అవిశ్రాంతంగా పని చేసిందని అన్నారు “

త‌న త‌ల్లి దేశం కోసం ఎంతో చేసింద‌ని, ఎన్నోసార్లు ఛాంద‌స‌వాదులు దాడుల‌కు దిగార‌ని గుర్తు చేశారు. బంగ్లాదేశ్‌ను విడిచి వెళ్లడానికి ఇష్ట పడలేదన్నారు స‌జీబ్ జాయ్. ఆమె ప్రతిదీ ఎదుర్కోవాలని కోరుకుంది. మేమంతా ఆమెను విడిచి పెట్టమని ఒప్పించామ‌న్నారు. ప్ర‌స్తుతం త‌న త‌ల్లి భారతదేశంలో సురక్షితంగా ఉందన్నారు .

“ఏ దేశం కోసం తాను జైలుకెళ్లి, కష్టపడిందో, ఎంతగానో అభివృద్ది చేసినా, బంగ్లాదేశ్ దేశ‌ ప్రజలు తనను ఈ విధంగా అవమానించి, వెళ్లగొట్టి, తనపై దాడికి దిగడాన్ని జీర్ణించు కోలేక పోయార‌ని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments