NEWSNATIONAL

భార‌త్ లో త‌ల‌దాచుకున్న షేక్ హ‌సీనా

Share it with your family & friends

బంగ్లాదేశ్ దేశంలో సైనిక పాల‌న ప్ర‌క‌ట‌న

బంగ్లాదేశ్ – యావ‌త్తు ప్ర‌పంచం విస్తు పోయేలా బంగ్లాదేశ్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌జ‌ల‌పై ఉక్కు పాదం మోపితే స‌హించ‌ర‌ని మ‌రోసారి నిరూపించారు అక్క‌డి ప్ర‌జ‌లు. ప్ర‌ధానంగా యువ‌తీ యువ‌కులు పోరాటం చేసిన తీరు ప్ర‌శంస‌నీయం. దెబ్బ‌కు దిగి వ‌చ్చింది ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనా. బంగ్లాదేశ్ అల్ల‌ర్ల‌లో దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అంచ‌నా.

ఇది ప‌క్క‌న పెడితే అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల మ‌ధ్య షేక్ హ‌సీనా ఇండియాకు చేరుకున్నారు. ఆమెకు పూర్తి సెక్యూరిటీ క‌ల్పించింది భార‌త ప్ర‌భుత్వం. ఇక్క‌డి నుంచి నేరుగా లండ‌న్ కు వెళ్లాల‌ని అనుకున్నారు. కానీ అక్క‌డ కూడా ప‌రిస్థితులు బాగోలేవు.

దీంతో యూకే ప్ర‌భుత్వం నుంచి ప‌ర్మిష‌న్ వ‌చ్చేంత వ‌ర‌కు త‌ను భార‌త్ లోనే ఉండ‌నుంది. మ‌రో వైపు బంగ్లాదేశ్ లో సైనిక పాల‌న కొన‌సాగుతుంద‌ని ఆర్మీ ప్ర‌క‌టించింది. ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం ఏర్ప‌డేంత దాకా పాల‌న ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రో వైపు అక్క‌డ చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై నిశితంగా గ‌మ‌నిస్తోంది భార‌త ప్ర‌భుత్వం.