NEWSTELANGANA

ఝార్ఖండ్ పీసీసీ చీఫ్ తో స‌లావుద్దీన్ భేటీ

Share it with your family & friends

డ్రైవ‌ర్లు..కార్మికుల స‌మ‌స్య‌లు ఏక‌రువు

హైద‌రాబాద్ – తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫార‌మ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, జాతీయ నాయ‌కుడు షేక్ స‌లావుద్దీన్ మంగ‌ళ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా ఝార్ఖండ్ పీసీసీ చీఫ్ కేశ‌వ్ మ‌హ‌తోవ్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా అసంఘ‌టిత రంగాల‌లో ప‌ని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి వివ‌రించారు. ప్ర‌ధానంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గిగ్ అండ్ ప్లాట్ ఫార‌మ్ వ‌ర్క‌ర్స్ 4,20,000 మందికి పైగా ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు.

ప్ర‌ధానంగా వీరికి సామాజిక‌, ఉద్యోగ భ‌ద్ర‌త అన్న‌ది లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశ వ్యాప్తంగా ప్ర‌తి రోజూ ప‌ని గంట‌లు లేకుండానే నిరంత‌రం డ్రైవ‌ర్లు, డెలివ‌రీ బాయ్స్ (కార్మికులు) నిద్ర హారాలు మాని ప‌ని చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు షేక్ స‌లావుద్దీన్.

ఇదిలా ఉండ‌గా జార్ఖండ్ పీసీసీ చీఫ్ తో పాటు ఆశిష్ సింగ్ , ఇత‌రుల‌తో క‌లిసి మేనిఫెస్టోలో గిగ్ వ‌ర్క‌ర్స్ చ‌ట్టం, సామాజిక భ‌ద్ర‌త‌, సంక్షేమ బోర్డు, క‌నీస వేత‌నాల వ‌ర్తింపు, త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌పై విస్తృతంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా తాను ప‌రిశీలిస్తాన‌ని హామీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు జార్ఖండ్ పీసీసీ చీఫ్‌.