గాడి తప్పిన యూనస్ పాలన – హసీనా
మాజీ అధ్యక్షురాలు షాకింగ్ కామెంట్స
న్యూఢిల్లీ – బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత ఆపద్దర్మ అధ్యక్షుడిగా ఉన్న ముహమ్మద్ యూనస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఒక రకంగా మారణ హోమానికి ఆయన కారకుడయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అణచివేతపై ఆ దేశ తాత్కాలిక నేత పై హసీనా మండిపడ్డారు.
తన బహిష్కరణ తర్వాత మొదటిసారి న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో హసీనా ప్రసంగించారు. యూనస్ “జాతి హత్య”కు పాల్పడ్డారని, హిందువులతో సహా మైనారిటీలను రక్షించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
తనను, తన సోదరి షేక్ రెహానాను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు తనకు సమాచారం ఉందని బాంబు పేల్చారు.
హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు ఎవరినీ విడిచిపెట్ట లేదన్నారు. దేవాలయాలు, బౌద్ద మందిరాలు ధ్వంసం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు షేక్ హసీనా. ఇస్కాన్ ప్రతినిధిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు.