క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్
ఢిల్లీ – తాను ఇక క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్. శనివారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ దేశీవాలీ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశాడు శిఖర్ ధావన్.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తను 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేలలో 6,793 పరుగులు చేస్తే టెస్టుల్లో 2,315 రన్స్ చేశాడు. ఇక టి20 ఫార్మాట్ లో 1,759 పరుగులు చేశాడు శిఖర్ ధావన్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత దేశానికి మళ్లీ ప్రాతినిధ్యం వహించ లేనన్న బాధ తనకు లేదన్నాడు.
అయితే ఇంత కాలం తనను ఆదరించినందుకు, భారత దేశం తరపున ఆడినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. ఆయన వయసు 38 ఏళ్లు. చిన్నప్పటి నుంచి నాకు ఓ కల ఉండేది. ఏదో ఒక రోజు భారత దేశం తరపున క్రికెట్ ఆడాలని అనుకున్నా. అది నెరవేరిందని, ఇవాళ క్రికెట్ నుంచి దూరం కావడం బాధకరమే అయినా తప్పదన్నాడు శిఖర్ ధావన్.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా కుటుంబానికి, నా చిన్న నాటి కోచ్ దివంగత తారక్ సిన్హాకు, మదన్ శర్మకు రుణపడి ఉన్నానని తెలిపాడు.