షిమ్రోన్ హెట్మెయిర్ కు జరిమానా
మ్యాచ్ లో 10 శాతం కోత విధింపు
చెన్నై – ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో దారుణమైన పరాజయం పొందింది రాజస్థాన్ రాయల్స్. ఈ సందర్బంగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆశించిన మేర రాణించ లేక పోయాడు. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సత్తా చాటిన సదరు విండీస్ క్రికెటర్ కు ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది.
టాస్ గెలిచిన కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే చాప చుట్టేసింది.
రియాన్ పరాగ్ , సంజూ శాంసన్ , షిమ్రోన్ హెట్మెయిర్, బోల్డ్ , రవిచంద్రన్ అశ్విన్ లు నిరాశ పరిచారు. ప్రధానంగా కెప్టెన్ శాంసన్ గత కొన్ని మ్యాచ్ లలో చేతులెత్తేశాడు. ఇదిలా ఉండగా మ్యాచ్ సందర్బంగా ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించాడని షిమ్రోన్ హెట్మెయర్ కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించినట్లు స్పష్టం చేసింది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కమిటీ.
ఓ వైపు మ్యాచ్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలై ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఫైన్ వేయడం విస్తు పోయేలా చేసింది.