NEWSNATIONAL

రాహుల్ కామెంట్స్ చౌహాన్ గుస్సా

Share it with your family & friends

ఎంఎన్పీ ఎందుకు ఇవ్వ‌డం లేదు

న్యూఢిల్లీ – లోక్ స‌భ‌లో స‌మావేశాలు వాడి వేడిగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రైతుల ప‌ట్ల పూర్తి వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని ఆరోపించారు. రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసినా ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆవేద‌న చెందారు రాహుల్ గాంధీ.

రైతులు పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారంటూ ఆరోపించారు. అయినా రైతు వ్య‌తిరేక ప్రభుత్వం అంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ. కేవ‌లం కొద్ది మంది పెట్టుబ‌డిదారుల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు .

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ మాట‌ల‌ను ఖండించారు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్. తాము ఎప్పుడు ఇవ్వ లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి అల‌వాటుగా మారింద‌ని ఎద్దేవా చేశారు.

ముందు మీ ప్ర‌భుత్వ హ‌యాంలో రైతుల‌కు ఏ మేర‌కు క‌నీస మ‌ద్ద‌తు క‌ల్పించారో చెప్పాల‌న్నారు చౌహాన్.