ఈవీఎంల ట్యాంపరింగ్ తో గెలిచారు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్
మహారాష్ట్ర – శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. శనివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఎన్నిలక రిజల్ట్స్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అయినా ఎన్డీయే కూటమి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదన్నారు.
దీనికి ప్రధాన కారణం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం తప్పా మరోటి కాదన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, తాము ఈ ఫలితాలపై విచారణ చేపట్టాలని కోరనున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు సంజయ్ రౌత్.
ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కానే కాదన్నారు. అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండేలపై జనం ఆగ్రహంతో ఉన్నారని, లోక్ సభ ఎన్నికలలో తమకే మెజారిటీ ఎక్కువగా వచ్చిందన్నారు. ఇప్పుడు ఎలా ఫలితాలు మారి పోతాయంటూ ప్రశ్నించారు శివసేన ఎంపీ.