NEWSTELANGANA

అర‌వింద్ కుమార్ ఒత్తిడి వ‌ల్లే చేశా

Share it with your family & friends

శివ బాల‌కృష్ణ విచార‌ణ‌లో సంచ‌ల‌నం

హైద‌రాబాద్ – ఇరు తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం క‌లిగించింది హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ లో స‌స్పెన్ష‌న్ కు గురైన మాజీ డైరెక్ట‌ర్ శివ బాల‌కృష్ణ వ్య‌వ‌హారం. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మార్కెట్ విలువ ప్ర‌కారం దాదాపు రూ. 250 కోట్ల‌కు పైగానే వెన‌కేసుకున్న‌ట్లు వెల్ల‌డైంది. ఈ విష‌యాన్ని ఏసీబీ అధికారులే బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

గ‌తంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఈయ‌న చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు. మాజీ మంత్రి కేటీఆర్ కు స‌న్నిహితంగా ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లెక్క‌కు మించిన నోట్ల క‌ట్ట‌లు, బంగారు ఆభ‌ర‌ణాలు, ప్లాట్లు, భూములు, ఫ్లాట్స్ , విల్లాలు ఇలా చెప్పుకుంటూ పోతే స‌మ‌యం ప‌ట్ట‌దు.

ఒక్క డిప్యూటీ డైరెక్ట‌రే ఇంత సంపాదిస్తే ఇక పై స్థాయిలో ఉన్న ఉన్న‌తాధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు ఇంకెంత వెన‌కేసుకున్నార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇది ప‌క్క‌న పెడితే శివ బాల‌కృష్ణ‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ ఎంక్వైరీలో దిమ్మ తిరిగే వాస్త‌వాలు బ‌య‌ట ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం ఉన్న‌త హోదాలో ఉన్న అర‌వింద్ కుమార్ పేరును ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం.
రియల్ ఎస్టేట్ వెంచర్లను ఆమోదించాలని సీనియర్ బ్యూరోక్రాట్ అరవింద్ కుమార్, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఎయుడి) స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఎయుడి) తనపై ఒత్తిడి తెచ్చారని, ఆర్థిక సహాయం కూడా కోరారని బాల కృష్ణ పేర్కొన్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఫార్ములా ఇ ఒప్పందంలోని ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వం గత నెలలో అరవింద్ కుమార్‌కు మెమో జారీ చేసింది.