అయ్యారే శ్రేయాస్ అయ్యర్
కోల్ కతా జట్టుకు అతడే బలం
కోల్ కతా – అందరి కళ్లు ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ పైనే ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో ఆశించినంత మేర రాణించ లేక పోయింది కేకీఆర్. కానీ ఇప్పుడు ఆ జట్టు సీన్ మారింది. ప్రముఖ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చాక టీంను అన్ని రంగాలలో రాటు దేల్చేలా చేశాడు.
ప్రస్తుతం తన కల ఒక్కటే ఐపీఎల్ కప్ ను ముద్దాడాలని. సూపర్ షోతో శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకుంటున్నాడు. అంతే కాదు కెప్టెన్ గా రాణిస్తూ ఇతర జట్లకు ఆదర్శ ప్రాయంగా మారాడు. తన సారథ్యంలోని కేకేఆర్ జట్టుకు తనే కీలకంగా మారాడు.
నాయకుడిగా తను ఆడడమే కాదు జట్టులోని ప్రతి ఆటగాడు ఆడేలా, కీలకమైన దశలో జట్టును గెలుపు తీరాలకు చేర్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీని వెనుక గంభీర్ ప్రయత్నం ఉంటే స్కిప్పర్ గా తను మరింత మైదానంలో అమలు పర్చడంలో పేరు పొందాడు శ్రేయాస్ అయ్యర్.
గతంలో భారత జట్టుకు ఆడాడు. ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా ఆడుతూ వస్తున్నాడు. తను మౌనంగా ఉన్నా మైదానంలోకి వచ్చే సరికల్లా భీకరంగా మారి పోతాడు అయ్యర్. మరి ఇవాళ తను ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.