SPORTS

శ్రేయాస్ అయ్య‌ర్ వెరీ స్పెష‌ల్

Share it with your family & friends

ధ్రువ్ రాఠీని అనుస‌రిస్తున్న క్రికెట‌ర్

కోల్ క‌తా – కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. దీనికి ప్ర‌ధాన కార‌ణం త‌ను బీజేపీ స‌ర్కార్ ను, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని వ్య‌తిరేకించ‌డ‌మే. దీని కార‌ణంగా త‌ను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి టీమిండియా త‌ర‌పున ఆడేందుకు గాను కాంట్రాక్టును కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన అంశం వైర‌ల్ అయ్యింది.

శ్రేయాస్ అయ్య‌ర్ హిందూ కుటుంబంలో పుట్టాడు. కోల్ క‌తా జ‌ట్టుకు య‌జ‌మానులు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టులు జూహీ చావ్లా, షారుక్ ఖాన్. ఇదే స‌మ‌యంలో కేకేఆర్ జ‌ట్టుకు కోచ్ గా ఉన్న‌ది ఎవ‌రో కాదు మోడీ భ‌క్తుడు, బీజేపీ ఎంపీ , మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్. త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో జ‌ట్టు సూప‌ర్ షో చేప‌ట్టింది.

ఐపీఎల్ 2024 టోర్నీలో ప్రారంభం నుండి అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. బ్యాటింగ్ లో బౌలింగ్ లో , ఫీల్డింగ్ లో అన్నింటా అన్ని జ‌ట్ల‌ను తోసి రాజ‌ని ఫైన‌ల్ కు చేరింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు షాక్ ఇచ్చింది.

ఇక దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క‌డు సంచ‌ల‌నంగా మారాడు. అత‌ను ఎవ‌రో కాదు ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ , మోడీ ప‌రివారానికి చుక్క‌లు చూపిస్తున్న ధ్రువ్ రాఠీ. విచిత్రం ఏమిటంటే శ్రేయాస్ అయ్య‌ర్ రాఠీని అనుస‌రిస్తుండ‌డం. ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత మ‌రోసారి వైర‌ల్ అయ్యారు.