అంపైర్ తో గిల్ గొడవ
తప్పు పట్టిన అనలిస్ట్ లు
జైపూర్ – సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 కీలక లీగ్ పోరులో గుజరాత్ టైటాన్స్ సత్తా చాటినా వైడ్ ఇచ్చే విషయంలో అంపైర్ తో గొడవ పడ్డాడు శుభ్ మన్ గిల్. కెప్టెన్ గా సంయమనం పాటించాల్సిన సమయంలో ఉన్నట్టుండి తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారాడు. అన్ ఫీల్డ్ వినోద్ శేషన్ తో చర్చకు దిగాడు.
రాజస్థాన్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో మోహిత్ శర్మ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. బంతి గీత దాటి పోయిందని, వైడ్ వస్తుందని కోరాడు. ఈ విషయాన్ని రియాన్ పరాగ్ ఒత్తిడి చేశాడు.
దీనిపై థర్డ్ అంపైర్ కీలక నిర్ణయం ప్రకటించాడు. అంపైర్ ఇచ్చిన వైడ్ బాల్ నిర్ణయం సరైనదేనంటూ తీర్పు వచ్చింది. మరో వైపు తర్వాతి ఓవర్ బంతికి శుభ్ మాన్ గిల్ డీఆర్ఎస్ కు వెళ్లాడు. కానీ అతడికి వ్యతిరేకంగా తిరిగి నిర్ణయం రావడంతో నిరాశకు లోనయ్యాడు గిల్.
అంపైర్ తో చర్చకు దిగాడు. సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా వినిపించు కోలేదు. కోపంతో ఊగి పోయాడు. తన స్థానంలోకి వెళుతూ కోపంగా బంతిని విసిరి వేయడం కనిపించింది.