SPORTS

సిద్దూకు షాక్ రూ. 851 కోట్ల నోటీస్

Share it with your family & friends

మాజీ క్రికెట‌ర్ పై పౌర స‌మాజం ఫైర్

పంజాబ్ – మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూకు కోలుకోలేని షాక్ త‌గిలింది. పౌర స‌మాజం సీరియ‌స్ అయ్యింది. ఏకంగా రూ. 851 కోట్ల నోటీస్ ఇచ్చింది. సిద్దూ భార్య‌కు క్యాన్స‌ర్ సోకింది. 40 రోజుల వ్య‌వ‌ధిలో వ్యాధి పూర్తిగా కంట్రోల్ లోకి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స్పెష‌ల్ డైట్ ను ఉద‌హ‌రించారు.

దీనికి సంబంధించి సాంప్ర‌దాయ క్యాన్స‌ర్ చికిత్స క్లెయిమ్ ల‌పై ఛ‌త్తీస్ గ‌ఢ్ సివిల్ సొసైటీ (సీసీఎస్) నుండి తాజాగా నోటీసు అందుకున్నారు మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ. ఈ సంద‌ర్భంగా సీసీఎస్ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ కుల్దీప్ సోలంకి సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న సిద్దూ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు

ఇలాంటి త‌ప్పుడు ప్ర‌క‌ట‌నలు ప్ర‌జ‌ల‌ను తీవ్ర గంద‌ర గోళానికి దారి తీసేలా చేస్తున్నాయంటూ మండిప‌డ్డారు. అల్లోపతి మెడిసిన్ ,థెరపీ గురించి ప్రతికూలంగా ఆలోచించేలా చేస్తున్నాయంటూ పేర్కొన్నారు. స‌మాజంలో పేరు పొందిన వాళ్లు చేసే ఇలాంటి ప్ర‌చారాల వ‌ల్ల చాలా మంది మృతి చెందే ప్ర‌మాదం లేక పోలేద‌ని అన్నారు సోలంకి.

అందుకే తాము లీగ‌ల్ నోటీసు సిద్దూకు పంపించ‌డం జ‌రిగింద‌ని, 40 రోజులు టైం ఇచ్చామ‌ని, లేక పోతే రూ. 851 కోట్లు క‌ట్టాల్సిందేనంటూ హెచ్చ‌రించారు.