సిల్క్ స్మిత జీవితమే ఓ కథ
అరుదైన నటి జయంతి
సిల్క్ స్మిత జయంతి సందర్బంగా సిల్క్ స్మిత క్వీన్ ఆఫ్ ద సౌత్ టీజర్ ను విడుదల చేశారు. సిల్క్ స్మిత దక్షిణ భారత వెండితెపై 1980లలో ఒక వెలుగు వెలిగారు. ప్రతి ఒక్కరూ మరచిపోలేని సాంస్కృతిక చిహ్నం . ఆమె అకాల మరణం విస్తు పోయేలా చేసింది. దశాబ్దాల తర్వాత ఆమె జీవిత కథ ఇప్పటికీ దాని చమత్కార కథను చెబుతోంది. ఈ లెజెండరీ నటి 64వ జన్మదినోత్సవం జరుపుకుంటోంది. ఈ బయో పిక్ లో చంద్రికా రవి నటించింది.
ఈ బయో పిక్ ను జయరామ్ శంకరన్ తీశారు. ఎస్బీ విజయ అమృత రాజ్ సిల్క్ స్మిత బయో పిక్ ను నిర్మించారు. దక్షిణ భారత భాషల్లో దీనిని తీస్తున్నారు. 2025లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇవాళ సిల్క్ స్మిత జ్ఞాపకార్థం మూవీ మేకర్స్ టీజర్ వీడియోను విడుదల చేశారు.
సిల్క్ స్మిత 1979 తమిళ చిత్రం వండిచక్రంలో తన విలక్షణమైన నటనతో కీర్తిని పొందింది. ఆమె ఈ చిత్రంలో “సిల్క్” పాత్రను పోషించింది. ఆ తర్వాత సిల్క్ అనే పేరు చివరి దాకా నిలిచి పోయేలా చేసింది.
తన 18 ఏళ్ల కెరీర్ లో 450 కంటే ఎక్కువ చిత్రాలలో నటించింది. గంభీరమైన వ్యక్తీకరణలు, ఆకర్షణీయమైన నృత్య కదలికలు, అసమానమైన తెరపై ప్రతిభ విలక్షణ నటిగా గుర్తింపు పొందేలా చేసింది. సెక్స్ చిత్రాలకు పేరు పొందినా తన కెరీర్ లో అద్భుతమైన పాత్రలలో నటించి తనను తాను ప్రూవ్ చేసుకుంది.