ఏపీ సీఎంతో ఎడ్గార్ పాంగ్ చియాంగ్ భేటీ
కలుసుకున్న సింగపూర్ కాన్సుల్ జనరల్
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు చెన్నై లోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ త్జే చియాంగ్. ఆయన నివాసంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా చంద్రబాబు చియాంగ్ ల మధ్య గంటకు పైగా చర్చలు కొనసాగాయి.
ఏపీ, సింగపూర్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక రంగాల పరంగా బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయులు పలుమార్లు సీఎంగా గతంలో సింగపూర్ దేశాన్ని పర్యటించారు. అక్కడ ప్రభుత్వం ఎలా పాలన సాగిస్తుందనే దానిపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా స్మార్ట్ సిటీగా సింగపూర్ ఎలా ఎదిగిందనే దానిపై దృష్టి సారించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇదే సమయంలో ఏపీని కూడా సింగపూర్ ను చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఏపీ సీఎం. ఆయనకు డైనమిక్ సీఎంగా పేరుంది. నిత్యం ఐటీ జపం చేసే చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే ఏపీని దేశంలోనే అన్ని రంగాలలో ముందంజలో నిలపాలని కంకణం కట్టుకున్నారు.