వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు
హైదరాబాద్ – ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. తెలుగు చలన చిత్ర సీమలో ఈ ఘటన కలకలం రేపింది. ఎక్కువ మొత్తంలో నిద్ర మాత్రలు మింగారు. హైదరాబాద్ లోని నిజాంపేట్ లో నివాసం ఉంటున్నారు. గత రెండు రోజుల నుంచి బయటకు రాలేదు. ఈ విషయం గమనించిన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సింగర్ ఇంటి తలుపులను బద్దలు కొట్టారు. దీంతో బెడ్ పై అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించారు. కల్పనను హుటా హుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అపస్మారక స్థితి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.
కాగా భర్త రాఘవేందర్ లేక పోవడం, కుటుంబీకులు ఆమె ఉంటున్న చోట లేక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా కల్పనను ఆస్పత్రిలో చేర్చారని తెలుసుకున్న వెంటనే టాలీవుడ్ కు చెందిన సినీ రంగ ప్రముఖులు, గాయనీ గాయకులు సునీత, శ్రీకృష్ణ, తదితరులు చేరుకున్నారు.
ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసిందనే కోణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.