ఐఏఎస్ సింధూరీపై సింగర్ ఫిర్యాదు
లోకాయక్తను ఆశ్రయించిన సింగర్
కర్ణాటక – ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన సింగర్ ఆయన. ఉన్నట్టుండి ఆయన లోకాయుక్తను ఆశ్రయించడం కలకలం రేపుతోంది. విచిత్రం ఏమిటంటే ఆయన చేసిన ఆరోపణలు ఎవరి మీదనో కాదు సాక్షాత్తు కర్ణాటకలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందిన రోహిణి సింధూరి. తనను ఆమె నుంచి రక్షణ కావాలని సింగర్ లక్కీ అలీ కోరడం విస్తు పోయేలా చేసింది.
రోహిణి సింధూరితో పాటు భర్త, బావ మరిది తన భూమిని అక్రమంగా లాక్కున్నారని సింగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన భూమిని తనకు ఇప్పించాలని కోరుతూ ఇవాళ కర్ణాటకలోని లోకా యుక్తను ఆశ్రయించారు.
రోహిణి సింధూరి మామూలు ఆఫీసర్ కాదని, తనతో పాటు ఇతరులు కలిసి ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కయ్యారంటూ గాయకుడు ఆరోపించారు. తన భూమిని (ట్రస్ట్ యాజమాన్యంలోని వ్యవసాయ పొలం) అక్రమంగా ఆక్రమించుకున్నారని వాపోయాడు అలీ.
వెంటనే విచారణ జరిపించి తనను ఆదుకోవాలని లోకాయుక్తను కోరాడు.