ENTERTAINMENT

అనురాగ్ కుల‌క‌ర్ణితో ర‌మ్య బెహ‌రా పెళ్లి

Share it with your family & friends

ఇద్ద‌రూ పేరు పొందిన గాయ‌నీ గాయ‌కులు

హైద‌రాబాద్ – తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన గాయ‌నీ గాయ‌కులు ఒక్క‌ట‌య్యారు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు ఇటీవ‌ల పాపుల‌ర్ పాట‌ల‌తో అల‌రిస్తూ వ‌స్తున్న అనురాగ్ కుల క‌ర్ణి, ర‌మ్య బెహ‌రా సంప్ర‌దాయ బ‌ద్దంగా శ‌నివారం ఒక్క‌ట‌య్యారు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సాంకేతిక నిపుణులు, హీరో హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సంగీత ద‌ర్శ‌కులు హాజ‌ర‌య్యారు. ఈ యువ నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.

అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన టాప్ సాంగ్స్ ల‌లో అత్య‌ధిక పాట‌ల‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు. మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. గ‌త కొంత కాలం నుంచీ కుల‌కర్ణి , ర‌మ్య బెహ‌రా క‌లిసి పాడారు కూడా. ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రూ అర్థం చేసుకోవ‌డం, ప‌రిచ‌యం క‌లిగి ఉండ‌డంతో ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లికి స‌మ్మ‌తి తెలిపారు.

ఈ ఇద్ద‌రూ సంతోషంగా ఉండాలని న్యూస్ సీల్స్ డిజిట‌ల్ మీడియా కోరుకుంటోంది.