రామోజీ నిత్య స్పూర్తి
సింగర్ సునీత సంతాపం
హైదరాబాద్ – తన లాంటి వారికి ఆయన నిత్యం స్సూర్తి కలిగిస్తూనే ఉంటారని రామోజీరావు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ గాయకురాలు ఉపద్రష్ట సునీత. ఆయన భౌతిక ఖాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈటీవీ ద్వారా తనకు అపారమైన అవకాశాలు కల్పించారని, అడుగడుగునా తనను ఆదరిస్తూ వచ్చారని కొనియాడారు. ఆయన లేని లోటు తీర్చ లేనిదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా చెరుకూరి రామోజీ రావు స్వస్థలం ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. 16 నవంబర్ 1936లో పుట్టారు. భారత దేశంలో మీడియా మొఘల్ గా పేరు పొందారు. వ్యాపార, వాణిజ్య వేత్తగా రాణించారు. రామోజీ సంస్థలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని విజయవంతంగా నడిపించారు. ప్రపంచంలోనే అతి పెద్ద చలన చిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు.
ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ నెట్‌వర్క్ ఆఫ్ టీవీ ఛానెల్‌లు, చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ ఉన్నాయి. ఇతర వ్యాపారాలలో మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి షాపింగ్ మాల్, ప్రియా పికిల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి.
రామోజీరావు కు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, ఐదు నంది అవార్డులతో పాటు జాతీయ స్థాయిలో పురస్కారాలు పొందారు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ పొందారు.