Saturday, May 24, 2025
HomeNEWSప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం

ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుందాం

పిలుపునిచ్చిన విమ‌ల‌క్క

హైద‌రాబాద్ – ప్ర‌జా గాయ‌కురాలు విమ‌ల‌క్క నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ను ఏకి పారేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని విద్యేతర వ్యాపార ప్రయోజనాలకు కేటాయించిన ప్రభుత్వం ఏకకాలంలో విద్యావరణాన్ని, పర్యావరణాన్ని దెబ్బ తీస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. సాంకేతికంగా ఈ భూమి స‌ర్కార్ దేన‌ని సుప్రీంకోర్టులో గెలిచినంత మాత్రాన దాన్ని అభివృద్ధి పేరిట ప్రైవేటు సంస్థలకు తెగనమ్మడం విద్యా ప్రయోజనాలను, విద్యార్థుల ప్రయోజనాలను విస్మరించడమే అవుతుందన్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసిన విధంగా బడ్జెట్ లో విద్యారంగానికి 15 శాతానికి బదులు సగం కూడా కేటాయించ లేక పోయిందని ఆరోపించారు విమ‌ల‌క్క‌. అలాగే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణను ఏడో గ్యారెంటీగా చేసి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు.
1969 తొలి తెలంగాణ ఉద్యమం ద్వారా 360 మంది ప్రాణాలు పణంగా పెట్టగా ఇందిరాగాంధీ ప్రకటించిన ఆరు సూత్రాలలో భాగంగా హెచ్ సీ యూ 2,300 ఎక‌రాలు కేటాయించింద‌న్నారు. ఇందులో చివ‌ర‌కు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కాగా 400 ఎక‌రాలు మాత్ర‌మే మిగిలాయ‌న్నారు.

ఎనిమిది వందల ఎకరాల భూములు కోల్పోయిన యూనివర్సిటీని భవిష్యత్ తరాల కోసం కాపాడే దూరదృష్టి పాల‌కుల‌కు ఉండాలే కానీ ఎవరో గుంట నక్కలు వ్యతిరేకిస్తున్నారనే పేరిట ఇంట్లో ఎలుకలు పడ్డాయని ఇల్లు కాలబెట్టుకునే విధంగా ప్రభుత్వ చర్యలున్నాయని మండి ప‌డ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments