NEWSTELANGANA

మేడిగ‌డ్డ‌లో కుంగింది మూడు పిల్ల‌ర్లే

Share it with your family & friends

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి

మేడిగ‌డ్డ – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మేడిగ‌డ్డ టూర్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్రాజెక్టు నుంచి మీడీయాతో మాట్లాడారు మాజీ మంత్రి. మేడిగ‌డ్డ‌లో మూడు పిల్ల‌ర్లు మాత్ర‌మే కుంగి పోయాయ‌ని అన్నారు.

కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. రాజ‌కీయం, వ్య‌వ‌సాయం వేర‌ని వాటిని ఒకే గాట క‌ట్టొద్ద‌న్నారు. తప్పులు జరిగి ఉంటే ఉన్నత స్థాయి విచారణ జరిపి శిక్షలు పడేలా చూడాల‌న్నారు నిరంజ‌న్ రెడ్డి. రైతుల పొలాల‌ను ఎండ పెట్టొద్ద‌ని, వారి ఉసురు పోసుకోవ‌ద్ద‌ని సూచించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ ఒక బ్యారేజ్ మాత్రమేన‌ని పేర్కొన్నారు. ఇది కాకుండా సుందిళ్ల, అన్నారం బరాజ్ లు, పంప్ హౌస్ లు, అండర్ గ్రౌండ్ టన్నెళ్లు, రిజర్వాయర్లు, ఓపెన్ కెనాళ్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సిస్టమ్ అభివృద్ది చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

వీటన్నింటినీ పక్కకు పెట్టి కుంగిన మూడు పిల్లర్లను చూపి ఇదే మొత్తం ప్రాజెక్ట్ అని దుర్భుద్దితో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మేడిగడ్డను సరి చేయాల‌ని డిమాండ్ చేశారు.

లేకుంటే గడపగడపకూ వెళ్లి రైతులను చైతన్యం చేస్తాం.. ఇంటికో వంద జమచేసి ఇంజనీర్ల సహకారంతో రైతులతోనే దీనిని రిపేర్ చేయించు కుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్రాజెక్టు అంతిమ లక్ష్యం రైతులకు సాగునీరు అందించడమేన‌ని పేర్కొన్నారు.