నియమించిన కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్ – రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది ఏఐసీసీ హై కమాండ్. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తనదైన ముద్ర వేశారు.
ఎవరూ ఊహించని విధంగా సిరిసిల్ల రాజయ్యకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవిని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ గా ఖరారు చేసింది. హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాజయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
ఇక సిరిసిల్ల రాజయ్యతో పాటు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్ రెడ్డి, మల్కుడ్ రమేష్, నెహ్రూ నాయక్ మాలోతును నియమించింది రాష్ట్ర సర్కార్. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
త్వరలోనే నూతనంగా నియమించబడిన సిరిసిల్ల రాజయ్యతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల వేళ మరికొందరికి పదవులు దక్కనున్నట్లు సమాచారం.