చైర్మన్ గా కొలువు తీరిన రాజయ్య
బాధ్యత స్వీకరించిన మాజీ ఎంపీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బాధ్యతలు చేపట్టారు. ఆయనతో సంతకం చేయించారు రాష్ట్ర ఆర్థిక సంస్థ ముఖ్య కార్యదర్శి , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్.
ఇదిలా ఉండగా చైర్మన్ గా కొలువు తీరిన రాజయ్యను పలువురు నేతలు అభినందించారు. ఏఐసీసీ హై కమాండ్ ఊహించని రీతిలో మాజీ ఎంపీకి ఛాన్స్ ఇచ్చింది. ఇదిలా ఉండగా రాజ్య సభ సీట్లకు సంబంధించి మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కు ఇస్తారని భావించారు.
కానీ వారికి ఇవ్వలేదు. ఈ సమయంలో త్వరలో రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 17 సీట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ సీట్లు వచ్చేందుకు కృషి చేయాలని ఇప్పటికే టార్గెట్ చేసింది. ఈ సమయంలో పలువురికి తాజాగా జరిగిన ఎన్నికల్లో సీట్లు రాలేదు. వారందరు అసంతృప్తికి లోనయ్యారు.
వారిని బుజ్జగించి కొన్నింటి పదవులను కట్టబెట్టేందుకు ప్లాన్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా రెండు కార్పొరేషన్లకు అప్పగించింది ఏఐసీసీ. మొత్తంగా రాజయ్యను పాలకుర్తి ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి అభినందించింది.