ఓట్ల లెక్కింపుపై ఏచూరి కామెంట్స్
కేంద్ర ఎన్నికల సంఘానిదే బాధ్యత
న్యూఢిల్లీ – సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏచూరి మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తోందని చెప్పారు.
ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సీసీటీవీ మానిటర్ కారిడార్ ద్వారా నియంత్రణ యూనిట్ల కదలికలపై నిఘా ఉంచాలని కోరారు సీతారాం ఏచూరి.
నియంత్రణ యూనిట్లలో ప్రదర్శించబడే ప్రస్తుత తేదీ, సమయం యొక్క ధృవీకరణ అనేది తప్పక ఉండాలన్నారు. అంతే కాకుండా ప్రారంభ, ముగింపు సమయం, ఓటింగ్ ప్రక్రియ తేదీ యొక్క నిర్ధారణ తప్పనిసరిగా చేయాలని సూచించారు.
ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్యను ప్రదర్శించే ముందు అభ్యర్థుల సంఖ్య , పోలైన ఓట్లను తప్పనిసరిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.