పవన్ కళ్యాణ్ సీఎం కావడం పక్కా
దర్శక నటుడు ఎస్ జే సూర్య కామెంట్స్
అమరావతి – ప్రముఖ తమిళ సినీ రంగ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎంగా కొలువు తీరిన కొణిదెల పవన్ కళ్యాణ్ పై ప్రశంసల జల్లులు కురిపించారు.
తనకు మంచి భవిష్యత్తు ఉందని కితాబు ఇచ్చారు ఎస్ జే సూర్య. ఇదే సమయంలో ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు. సీఎంగా ఉండేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు ఎస్ జే సూర్య.
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు -2 చిత్రానికి సంబంధించిన ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు దర్శక, నటుడు. తన మనసులోని మాటను చెప్పారు. ప్రస్తుతం ఎస్ జే సూర్య చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.